2023 లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటివరకు హిట్ అయిన సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకున్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. నందమూరి నాటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందినటువంటి వారసుడు అనే తమిళ డబ్బింగ్ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది.
ప్రియదర్శి హీరోగా వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. విశ్వక్ సేన్ హీరోగా రూపొందినటువంటి దాస్ కా దమ్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ విజయాన్ని అందుకుంది. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: