తన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి సనన్..!!

murali krishna
కెరియర్ మొదట్లో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి వారిలో నటి కృతి సనన్ కూడా ఒకరు.
తెలుగులో మహేష్ బాబు  హీరోగా నటించిన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అనంతరం నాగచైతన్య సరసన దోచేయ్ సినిమాలో నటించారు.తెలుగులో ఈమె నటించిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ఆమె అడుగులు వేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకొన్నారు.
ప్రస్తుతం బాలీవుడ్  ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను అయితే వెల్లడించారు.ప్రస్తుతం తాను ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పటికీ తాను ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానని ఆ మధ్య తరగతి కుటుంబం విలువలను  అలాగే మూలాలను తాను ఎప్పటికీ మర్చిపోనని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రేమాభిమానాలు పంచే కుటుంబం నిస్వార్థమైన స్నేహం తోడుగా ఉంటే ఎన్ని విజయాలు సాధించిన వ్యక్తిత్వంలో మార్పు అస్సలు రాదని వెల్లడించారు. తాను ఢిల్లీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్న ఇప్పటికీ ప్రతిరోజు తన ఢిల్లీ స్నేహితులతో మాట్లాడుతూనే ఉంటానని కూడా తెలిపారు. నా జయాపజయాలతో సంబంధం లేకుండా వారు నన్ను ఎంతగానో వారు ఇష్టపడుతుంటారు. వారిది కల్మషం లేని ప్రేమ అని . అలాంటి గొప్ప స్నేహబృందం, సంప్రదాయ విలువల్ని పాటించే కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా నా స్వభావంలో ఎలాంటి మార్పు అయితే లేదని ఈ సందర్భంగా కృతి సనన్ వెల్లడించారట..ఇలా మధ్యతరగతి కుటుంబం విలువల గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక కృతి సనన్ ప్రస్తుతం ప్రభాస్  హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: