ప్రభాస్ పై ఐటీ దాడులు జరగబోతున్నాయా...?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ బ్యానర్లలో మైత్రీ మూవీస్ ఒకటనే విషయం తెలిసిందే. తెలుగులో ఈ బ్యానర్ దాదాపుగా అందరు టాప్ హీరోలతో సినిమాలు చేసిందనే విషయం తెలిసిందే.

కొన్నిరోజుల క్రితం ఈ బ్యానర్ పై ఐటీ దాడులు జరగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే ఈ దాడులలో ఎక్కువగా ఏమీ దొరకలేదని అయితే హీరోల రెమ్యునరేషన్లను మాత్రం వారు ఆరా తీశారని సమాచారం అందుతోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఒక మూవీ తెరకెక్కుతోందనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ కు కొంత మొత్తం అడ్వాన్స్ గా అయితే అందింది. అయితే ఐటీ రైడ్స్ లో ప్రభాస్ పారితోషికం గురించి ఆరా తీశారని సమాచారం.రాబోయే రోజుల్లో ప్రభాస్ పై ఐటీ రైడ్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.

చాలామంది టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే మొత్తం పారితోషికాన్ని స్టార్ హీరోల్లో చాలామంది సగం వైట్ లో, సగం బ్లాక్ లో తీసుకుంటున్నారనీ తెలుస్తుంది.. రాబోయే రోజుల్లో స్టార్ హీరోలపై ఐటీ రైడ్స్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని హీరోలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైందని కొంతమంది కామెంట్లు కూడా చేస్తున్నారు. 

స్టార్ హీరోలపై ఐటీ రైడ్స్ జరిగితే మాత్రం కొందరు స్టార్ హీరోలకు ఇబ్బందులు తప్పవని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కొందరు స్టార్స్ మాత్రం తమ పారితోషికం గురించి వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెబుతున్నారు. మైత్రీ బ్యానర్ పై జరిగిన ఐటీ రైడ్స్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది.. మైత్రీ బ్యానర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో టాప్ బ్యానర్ గా దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: