పుష్ప 2 నుండి లీక్ అయిన మరో డైలాగ్...ఆనందంలో ఫ్యాన్స్....!!

murali krishna
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ డైరెక్షన్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప ఇండియా వైస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే.ఇప్పుడు దానికి సీక్వల్ తీసే పనిలో ఉన్నారు మూవీ టీం ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ మధ్యే ఈ సినిమా కి సంభందించిన డైలాగ్  ఒకటి నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది.
సుకుమార్  రైటింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.పుష్ప పార్ట్ 1 లో ఒక నార్మల్ మనిషి స్మగ్లింగ్ వ్యవస్థకి రాజు ఎలా అవుతాడు అని చూపించారు ఇక పుష్ప పార్ట్ 2 లో ఆ రాజు అయినా పుష్ప తన వ్యవస్థ ని ఎలా రూల్ చేయబోతున్నాడో చూపించబోతున్నాడు.
అయితే పార్ట్ 1 లో చూపించినట్టు గానే పుష్ప షెకావత్ ని అవమానించినందుకు పుష్ప మీద భన్వర్ సింగ్ షెకావత్,తనని కొట్టినందుకు,శ్రీవల్లి ని తనకి దక్కకుండా చేసినందుకు కొండా రెడ్డి తమ్ముడు జాలి రెడ్డి, తన బామ్మరిది ని చంపినందుకు మంగళం శ్రీను ఇలా అందరు పుష్ప మీద కోపం తో ఉంటారు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నప్పుడు
ఒకరోజు షెకావత్ వేసిన ప్లాన్ కి పుష్ప వస్తాడు పుష్ప దొరికిపోయాడు అని షెకావత్ అనుకునే లోపులో అది పుష్ప వేసిన ప్లాన్ అని తెలుస్తుంది అంటే షెకావత్ సారే పుష్ప కి దొరికిపోతాడు అప్పుడు పుష్ప తనని చంపేస్తాడు అనుకుంటున్నా షెకావత్ తో పుష్ప ఈ డైలాగ్ చెప్తాడు.నేను బోన్ లోకి మాంసాన్ని విసిరేస్తే బతికే పులి ని కాదు, అడవి లో వేటాడే పులి ని సారూ.వేటాడి పంజా దెబ్బ కొడితేనే కదా మజ ఉండేది. అని చెప్పి షెకావత్ ని వదిలేస్తాడు.పుష్ప సినిమా నుంచి లీకైన ఈ డైలాగ్ ఇప్పుడు నెట్ లో తెగ వైరల్ అయింది.ఈ డైలాగ్ విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా పుష్ప పార్ట్ 1 ని మించి ఉంటుంది అని సంబర పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: