దూసుకుపోతున్న విరూపాక్ష.. మేకర్స్ సూపర్ ప్లాన్?

Purushottham Vinay
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరూపాక్ష'. 'శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర' 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించడం జరిగింది.అలాగే సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అజయ్, యాంకర్ శ్యామల, సునీల్, రాజీవ్ కనకాల, సాయి చంద్ ఇంకా అభినవ్ గోమఠం వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించగా 'కాంతార' ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ఇంకా అలాగే ట్రైలర్లకి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది.దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.అందుకు తగ్గట్టు గానే మొదటి రోజు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు సూపర్ గా కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు, మూడో రోజు కూడా చాలా బాగానే కలెక్ట్ చేసింది.


ఒకసారి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే..'విరూపాక్ష' సినిమాకి రూ.22.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖచ్చితంగా రూ.22.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా మొత్తం రూ.20.69 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇక బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా మరో రూ.2.11 కోట్ల షేర్ ను ఖచ్చితంగా రాబట్టాలి. ఆదివారం రోజు కూడా ఈ సినిమా చాలా బాగా కలెక్ట్ చేసింది. మొదటి సోమవారం రోజున ఈ సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక గ్రాస్ విషయానికి వస్తే ఈ సినిమా దాదాపు 100 కోట్ల దాకా వసూళ్లు చేసినట్టు సమాచారం తెలుస్తుంది. సినిమాకి ఎలాగో బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో అలాగే వసూళ్లు కూడా బాగా నమోదు కావడంతో ఈ సినిమాని బాలీవుడ్ ఇంకా ఇతర భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి చూడాలి ఈ సినిమా ఏ విధంగా అక్కడ జనాలని మెప్పిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: