'విరూపాక్ష' సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..?

Anilkumar
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొంత గ్యాప్ తర్వాత లేటెస్ట్ గా నటించిన మూవీ 'విరూపాక్ష' బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. SVCC బ్యానర్ పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సుకుమార్ సైతం స్క్రీన్ ప్లే అందించాడు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ సొంతం చేసుకొని..భారీ విజయాన్ని అందుకుంది. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ అంతా ఈ సక్సెస్ ని కలిసి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

తాజాగా సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే విరూపాక్ష సీక్వెల్ పై ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే మూవీ డైరెక్టర్ కార్తీక్ దండు ఫ్యాన్స్ కి ఓ క్లారిటీ ఇవ్వడంతో పాటు ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్.. ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు. విరూపాక్ష మూవీకి సీక్వెల్ వస్తుందా? అని అడగగా.. 'ఇప్పటివరకైతే అనుకోలేదు. నేను, సుకుమార్ గారు ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా సీక్వెల్ ఉంటుంది. కానీ అది వెంటనే రాకపోవచ్చు' అని చెప్పాడు. దీంతో విరూపాక్షకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఫాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక సాయి తేజ కెరియర్ లోనే మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన విరూపాక్ష సినిమాని మొదట తెలుగు, తమిళ భాషల్లోనే రిలీజ్ చేశారు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 20 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇక ప్రస్తుతం సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. కాగా విరూపాక్ష మూవీ సక్సెస్ ను మూవీ టీమే కాకుండా మెగా ఫ్యామిలీ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సాయి తేజను ఇంటికి పిలిపించి మరి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు.అటు రాంచరణ్ కూడా సినిమా సక్సెస్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక రాంచరణ్ తో పాటు రవితేజ, కళ్యాణ్ రామ్ తదితరులు సాయి తేజ్ ను అభినందిస్తూ.. విరుపాక్ష మూవీ పై ప్రశంసలు కురిపించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: