రాఘవేంద్రరావు కి వార్నింగ్ ఇచ్చిన ' ఆర్జీవి ' ...!!

murali krishna
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా హైలెట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ.
తరచూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అంతకాకుండా ఏ విషయం అయినా కూడా ముఖం మీద కుండలు బద్దలుకొట్టినట్లు చెప్పడం రామ్ గోపాల్ నైజం అని చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు ఎంత బోల్డ్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇంటర్వ్యూలు మాత్రమే కాకుండా అందులో చేసే వ్యాఖ్యలు మాట్లాడే మాటలు కూడా బోల్డ్ గానే ఉంటాయి.
ఇకపోతే రాంగోపాల్ వర్మ కి అతిలోకసుందరి శ్రీదేవి అంటే అమితమైన ఇష్టం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు వర్మ. ఆర్జీవికి శ్రీదేవి అంటే ఎంత ఇష్టం అని చెప్పడానికి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని నిదర్శనం అని చెప్పవచ్చు. శ్రీదేవి కోసం ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని చంపేస్తాను అంటూ బెదిరించారు రాంగోపాల్ వర్మ. తాజాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీదేవి ఉన్నప్పుడే రాఘవేంద్రరావు రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ కలిసి ఆమెతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీదేవి రాఘవేంద్రరావు తండ్రి సూర్య ప్రకాష్ దర్శకత్వంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించిందట. ఆ సమయంలో రాఘవేంద్రరావు కూడా కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించారట. తన తండ్రి లేని సమయంలో శ్రీదేవిపై రన్నింగ్ షాట్ చిత్రీకరించి మెప్పు పొందాలనుకున్నారట రాఘవేంద్ర రావు. మద్రాసులోని మౌంట్ రోడ్డులో శ్రీదేవి రోడ్డు దాటుతూ పరిగెత్తాలి. శ్రీదేవి చిన్న పిల్ల కాబట్టి ఏం చెప్పినా తిరిగి అడగకుండా చేసేది. రోడ్డులో వేగంగా పరిగెత్తింది. రోడ్డు దాటే క్రమంలో ఒక కారు వేగంగా రావడం శ్రీదేవి కాలి మడమకు తగలడంతో ఆమె అక్కడే పడిపోయింది. అప్పటికే శ్రీదేవి ముందుకు వచ్చేయడంతో రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదం తప్పిందట. ఇంటర్వ్యూలో ఆ క్లిప్పింగ్ ని కూడా చూపించారు. ఆ వీడియో చూడగానే వర్మ హార్ట్ స్కిప్ అయింది. ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అని రాఘవేంద్ర రావు అనగా వెంటనే రామ్ గోపాల్ వర్మ అప్పుడు నేను మిమ్మల్ని చంపేసేవాడిని అంటూ వర్మ కామెంట్స్ చేయడం నవ్వులు పూయించింది. ఆర్జివి దర్శకత్వంలో శ్రీదేవి క్షణక్షణం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: