"లియో" మూవీకి అన్ని కోట్ల బిజినెస్ జరిగిందా..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న తలపతి విజయ్ ఆఖరుగా వారిసు అనే మూవీ లో హీరో గా నటించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ యొక్క తమిళ వర్షన్ ఈ సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేశారు.

ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ ను ఈ సంవత్సరం జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ వెర్షన్ అద్భుతమైన విజయం సాధించగా ... తెలుగు వర్షన్ యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ "లియో" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. లోకేష్ ఈ మూవీ ని యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు. త్రిష ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఇది వరకే విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో రూపొందిన మాస్టర్ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ... అలాగే లోకేష్ ఆఖరుగా దర్శకత్వం వహించిన విక్రమ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ హక్కులకే ఏకంగా 450 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: