ఎన్టీఆర్ 30వ మూవీ ఫస్ట్ లుక్ విడుదల అప్పుడే..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఈ సినిమా బృందం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వెళ్తుంది.

ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కథ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు ఈ మూవీ కథ ప్రకారం ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్న నేపథ్యంలో ఈ మూవీ కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్ లను ఈ చిత్ర బృందం ఇప్పటికే తీసుకుంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ కొరియోగ్రాఫర్ లు భారీ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.

ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ నుండి చిత్ర బృందం ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్ లను విడుదల చేయలేదు. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్ర బృందం ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం రామోజీ ఫిలిం సిటీ లో  ఎన్టీఆర్ ... జాన్వి కపూర్ ... సైఫ్ అలీ ఖాన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: