పవన్ ... శ్రీలపై అదిరిపోయే మాస్ సాంగ్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పవన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ లో ఇప్పటికే పవన్ తో పాటు శ్రీ లీల కూడా జాయిన్ అయింది. అలాగే ఈ మూవీ బృందం ఇప్పటికే పవన్ మరియు శ్రీ లీల పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించింది.

ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా ఈ మూవీ బృందం ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేషన్ సెట్ లో ఇప్పటికే పవన్ పై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... మైత్రి మూవీ సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో పవన్ మరియు శ్రీ లీల పై ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ను హరిష్ శంకర్ డిజైన్ చేసినట్లు ... ఇప్పటికే ఈ మాస్ సాంగ్ కు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ఇచ్చినట్లు ... మరి కొన్ని రోజుల్లోనే పవన్ మరియు శ్రీ లీల పై ఆ మాస్ సాంగ్ ను చిత్ర బృందం చిత్రీకరించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: