"గేమ్ చేంజర్" మూవీలో ఇంటర్వెల్ అదిరిపోయే రేంజ్లో ఉండబోతుందట..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అదిరిపోయి రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. అలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించుకున్న చరణ్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి ఆచార్య మూవీ లో ఒక కీలకపాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచింది.

 దానితో ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలి పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... కియార అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతుంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో అంజలి ,  సునీల్ , శ్రీకాంత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశం కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు ... ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ఈ మూవీ ఇంటర్వెల్ రానున్నట్లు ... ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ స్వతంత్ర పోరాట యోధుల గొప్పతనాన్ని చెప్పే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న చరణ్ ... శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: