"పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2" ఒక క్లాసిక్... కార్తీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకున్న ఈ హీరో తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే కార్తీ మొదటగా తాను నటించిన యుగానికి ఒక్కడు సినిమాను తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు.

 ఆ తర్వాత తాను నటించిన అనేక సినిమాలను టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విడుదల చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో పొన్నియన్ సెల్వన్ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా తాజాగా నిన్న రాత్రి ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కార్తీ మాట్లాడుతూ ... పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 మూవీ వినోదాన్ని అందించింది ... పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 క్లాసిక్ గా మిగిలిపోబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించగా ... ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. చియాన్ విక్రమ్ ... జయం రవి ... ఐశ్వర్య రాయ్ ... త్రిష ఈ మూవీ లో ఇతర కీలక పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: