నితిన్ ను అలా అని అవమానించిన ఒకప్పటి హీరోయిన్...!!

murali krishna
మామూలుగా ఎవరినైనా నమ్మించి మోసం చేస్తే తిరిగి వాళ్లకే ఎదురుదెబ్బ తగులుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేస్తే సర్దుకుంటాయేమో కానీ
కావాలని నమ్మించి మోసం చేస్తే మాత్రం అది ఎప్పటికీ సర్దుకోవు. అటువంటివి ఏ విషయంలోనైనా సరే సామాన్యుల మధ్య, ఒక హోదా లో ఉన్న వ్యక్తుల మధ్య జరుగుతూ ఉంటాయి. అయితే హీరో నితిన్ విషయంలో కూడా ఒక హీరోయిన్ నమ్మించి మోసం చేయడంతో తిరిగి ఆ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు ఘోరంగా తయారైందని తెలుస్తుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.. ఏ విషయంలో మోసం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. చాలావరకు లవ్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిసారిగా 2002లో జయం సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టగ ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు అందించింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించిన నితిన్ కు ఉత్తమ నటుడుగా గుర్తింపు వచ్చింది.అయితే గత కొన్ని రోజుల నుండి నితిన్ ఖాతాలో సక్సెస్ అనేది లేకుండా పోయింది. నిజానికి టాలీవుడ్ లో ఈయన ఈ మధ్య చాలా తక్కువ సినిమాలలో కనిపిస్తున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈయన ఇప్పుడు కేవలం చాలా గ్యాప్ తో ఒక్క సినిమాతోనే వస్తున్నాడు. వచ్చిన సినిమాలతో కూడా అంత సక్సెస్ కాలేకపోతున్నాడు నితిన్. ఇక ఆ మధ్య మాచర్ల నియోజకవర్గo సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా పూర్తి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆయన అభిమానులు బాగా నిరాశ చెందారు. దీంతో ఆయన సక్సెస్ కోసం బాగా ఎదురు చూస్తున్నాడు. పైగా ఎంచుకునే కథలు విషయంలో కూడా బాగా జాగ్రత్త పడుతున్నాడు.అయితే ఒక హీరోయిన్ నితిన్ ను మోసం చేసిందన్న వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే మాచర్ల నియోజకవర్గం సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. ఐటమ్ సాంగ్ లో అంజలి నటించిన. అయితే ఐటెం సాంగ్ కు అంజలికి ముందు హీరోయిన్ సదా ను అనుకున్నారట. దీంతో సదా కూడా ఓకే అనటంతో ఫస్ట్ నుంచి ఈ పాట చేస్తా అంటూ నమ్మించి చివరికి హ్యాండ్ ఇచ్చిందట. అంతేకాకుండా ఒకప్పుడు నీతో హీరోయిన్ గా చేసి ఇప్పుడు ఐటమ్ గర్ల్ గా ఎలా చేయాలి అని ప్రశ్నించిందట. దీంతో ఆమె మోసం చేసిందని గమనించిన నిర్మాతలు చివరి క్షణాల్లో నాలుగు కోట్లు ఇచ్చి అంజలితో డాన్స్ చేయించారట. అలా నితిన్ ను మోసం చేసినందుకు ఇప్పుడు ఆమెకు తగిన ప్రాప్తి జరుగుతుందని నితిన్ అభిమానులు అనుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రస్తుతం ఆమె సినిమాల కోసం బాగా ఆరాటపడుతుంది. కానీ ఆమెకు ఏ ఒక్కరు కూడా అవకాశాలు ఇవ్వకపోవడంతో.. ఏం చేయలేక బుల్లితెర షోలలో చేస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: