టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ బ్యానర్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో లైకా ప్రొడక్షన్ సంస్థ ఒకటి. ఈ సంస్థ ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లను నిర్మించి వాటితో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన నిర్మాణ సంస్థగా ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో కొనసాగుతుంది.

 ఇది ఇలా ఉంటే ఈ నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఎక్కువ శాతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి తోను ... స్టార్ డైరెక్టర్ లుగా కొనసాగుతున్న వారి తోను సినిమాలను నిర్మించి అతి తక్కువ కాలం లోనే స్టార్ ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ మూవీ మూవీ ఇండియన్ 2 ను నిర్మిస్తుంది.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నిర్మాణ సంస్థ పొన్నియన్ సెల్వన్ మూవీ ని నిర్మించింది. ఈ మూవీ యొక్క మొదటి భాగం ఇప్పటికే మంచి విజయం సాధించింది. ఈ మూవీ రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు త్వరలోనే లైకా ప్రొడక్షన్ బ్యానర్ వారు టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని చెప్పుకొచ్చాడు. సుభాస్కరన్ లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: