మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ''విరూపాక్ష''ఈ సినిమా ఏప్రిల్ 21న చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆడియెన్స్ ను బాగానే థియేటర్స్ కు రప్పిస్తుంది.. కేవలం మౌత్ టాక్ తోనే వరల్డ్ వైడ్ గా బాగా పుంజుకుంటున్న ఈ సినిమా యూఎస్ లో కూడా చాలా గ్రాండ్ గానే విడుదల అయ్యింది.అక్కడ ప్రీమియర్స్ తో పాటు సాలిడ్ గా కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమా యూఎస్ రిపోర్ట్ ప్రకారం ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే కలిసి 2 లక్షల డాలర్స్ గ్రాస్ ను వసూలు చేసినట్టు అనౌన్స్ చేసారు.. ఇక రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా హాఫ్ మిలియన్ మార్క్ ని టచ్ చేసినట్టు తాజా సమాచారం.. దీంతో ఈ సినిమా క్రేజ్ ముందు కంటే ఇప్పుడు మరింత పెరిగింది అనే చెప్పాలి.
అందులోను వీకెండ్ కావడం ఇంకా ఈ రోజు కూడా వసూళ్లు గట్టిగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి..ఇక సరిగమ సినిమాస్ వారు యూఎస్ లో ఈ సినిమాను రిలీజ్ చేయగా ఈ సినిమా అక్కడ రెండు రోజుల్లోనే ఏకంగా హాఫ్ మిలియన్ మార్క్ ను టచ్ చేసినట్టు తాజాగా అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేసారు.. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండ ఈ సినిమా సినిమా యూఎస్ లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ని రాబడుతుందనే చెప్పాలి.. ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ ఇంకా బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది.గత కొంత కాలం నుంచి సుకుమార్ అసిస్టెంట్స్ అంతా కూడా హీరోలకు మంచి మంచి హిట్స్ ఇస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా సుకుమార్ ఇచ్చిన కథతో ఈయన అసిస్టెంట్ తెరకెక్కించిన ఈ సినిమా ఖచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఇక ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ కాంతార సినిమాతో ఆకట్టుకున్న అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు..