కమల్ ... మణిరత్నం కాంబినేషన్ మూవీలో ఆ క్రేజీ హీరోయిన్..!

Pulgam Srinivas
అద్భుతమైన టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటుడు గా తనను తాను నిరూపించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఇప్పటికీ కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే కమల్ ఆఖరుగా విక్రమ్ అనే మూవీ లో నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ కి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కమల్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

దానితో కమల్ తన తదుపరి మూవీ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కమల్ తన తదుపరి మూవీ ని మణిరత్నం దర్శకత్వం లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 35 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ కావడంతో ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే కమల్ ... మణిరత్నం కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించబోతున్నట్లు ... ఆండ్రియా ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: