వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న పూజా హెగ్డే..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత అనేక తమిళ ... హిందీ మూవీ లలో నటించి కోలీవుడ్ ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన క్రేజ్ ను ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్న పూజ హెగ్డే ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయం లేక బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోతుంది. కొంత కాలం క్రితం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ.లో రామ్ చరణ్ కు జోడిగా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కొంత కాలం క్రితమే సర్కస్ అనే బాలీవుడ్ మూవీ లో ఈ ముద్దుగుమ్మ నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఈ ముద్దుగుమ్మ తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందినటువంటి "కిసి కా భాయ్ కిసి కా జాన్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: