భార్య చెప్పులు మోసిన స్టార్ హీరో.. వైరల్ వీడియో?

praveen
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల పాటు లవ్ లో కొనసాగి ఆ తర్వాత తమ ప్రేమకు పెళ్లి అనే ప్రమోషన్ ఇచ్చుకున్న వారిలో బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్, అలియా బట్ జంట కూడా ఉంది.  ఇక వీరిద్దరూ  కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ సినిమాల్లో ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీ బిజీగా మారిపోయారు. అయితే వీరిద్దరూ ఏ సినిమా ఫంక్షన్ కి హాజరైన కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటారు. ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమాభిమానాలు చూపించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఈ స్టార్ కపుల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు.

 ఎందుకంటే ఇటీవల ఈ జంట చేసిన పని కాస్త ప్రస్తుతం విమర్శలకు కారణం అయ్యింది అని చెప్పాలి. ఏకంగా రణబీర్ కపూర్ తన భార్య ఆలియా భట్ చెప్పులను మోయటమే ఇందుకు కారణం. అదేంటి భార్య చెప్పులను భర్త మోస్తే తప్పేంటి. దీనికి కూడా ట్రోల్స్ చేయాలా అని అనుకుంటున్నారు కదా. అయితే ఇలా ట్రోల్ చేయడానికి మరొక కారణం ఉంది. ఇటీవల ఫిలిం మేకర్ ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా కన్నుమూసింది. ఈ వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు అంతా కూడా ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

 ఈ క్రమంలోనే ఆలియా భట్, రణబీర్ కూడా కాస్త ఆలస్యంగా ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లోకి వెళ్లే క్రమంలో తన చెప్పులను గుమ్మం ముందు విడిచి వెళ్ళింది ఆలియా భట్. అయితే వెనకే వచ్చిన రణబీర్ ఆ చెప్పులను చేతులతో పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న.. అసలు రోలింగ్ కి కారణం ఏంటంటే చెప్పులను లోపలికి తీసుకువెళ్లిన రణబీర్  ఇంట్లో ఉన్న చిన్న గుడి ముందు ఆ చెప్పులను పెట్టాడు. అయితే భార్య చెప్పులు మోయటం తప్పు కాదు. కానీ వాటిని గుడి ముందు పెట్టడం ఏంటి అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలియా అన్ని ఆలోచించే చెప్పులను బయట వదిలింది. కానీ రణబీర్ తెలివి తక్కువ పని చేస్తున్నాడు అంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: