"ఓటిటి" లో ఆ 4 భాషల్లో మాత్రమే విడుదల కానున్న "దసరా" మూవీ..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహానటి కీర్తి సురేష్ ... నాని సరసన హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ  తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి పాజిటివ్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర  ఇప్పటికే అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే వెలువడింది. ఇది ఇలా ఉంటే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మాత్రం కేవలం 4 భాషల లోనే విడుదల కానున్నట్లు ప్రకటన వచ్చింది.

ఈ మూవీ యొక్క తెలుగు , తమిళ , కన్నడ  మలయాళ వెర్షన్ లను నెట్ ఫ్లీక్స్ డిజిటల్ సంస్థ ఏప్రిల్ 27 వ తేదీ నుండి తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ హిందీ వర్షన్ ను ఏ రోజు నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. మరి ఈ మూవీ హిందీ వర్షన్ ను ఏ రోజు నుండి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: