"లియో" ఆడియో వేడుకను అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ తాజాగా వారిసు అనే తమిళ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రూపొందిన ఈ మూవీ తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల అయింది. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ ... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపాందుతున్న లియో అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు .

ఈ సంవత్సరం అక్టోబర్ 19 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు . త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు . ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే విజయ్ ... లోకేష్ ... అనిరుద్ కాంబినేషన్ లో రూపొందిన మాస్టర్ మూవీ ఆల్బమ్ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ఆల్బమ్ ను కూడా అదే స్థాయిలో చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఆడియో వేడుకను తమిళ నాడు లోని ఒక భారీ పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: