నెక్స్ట్ షెడ్యూల్లో అంతమంది ఫైటర్స్ తో భారీ యాక్షన్ సన్నివేశం ప్లాన్ చేస్తున్న "గేమ్ చేంజర్" మూవీ యూనిట్..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిరుత మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి  మొదటి మూవీ తోనే స్టార్ హీరోగా మారిపోయిన చరణ్ ఆ తర్వాత మగధీర మూవీ తో ఇండస్ట్రీ హిట్ ను కొట్టి తన స్టామినా ను బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో నిరూపించుకున్నాడు. అలాగే ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించిన రామ్ చరణ్ ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం గ్లోబల్ గా తన క్రేజ్ ను పెంచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ కేవలం ఇంకో 60 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 23 వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాన్ని 1200 మంది ఫైటర్స్ తో చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ యాక్షన్స్ సన్నివేశం ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో శ్రీకాంత్ , అంజలి , సునీల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: