అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ ఎవరంటే?

Purushottham Vinay
టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికాలు అందుకుంటున్న స్టార్స్ విషయానికొస్తే... ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి మొదలు పెట్టి పవన్ కళ్యాణ్ దాకా చాలా మంది అగ్రహీరోలు కూడా ఒక్కొక్క సినిమాకీ కొన్ని కోట్లల్లోనే రెమ్యూనేషన్ చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది.ఇక వారిలో అత్యంత భారీ స్థాయిలో పారితోషికాలను అందుకుంటున్న అగ్రహీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బహుబలి సినిమాతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి తెలుగు నుంచి మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా హీరోగా ముద్ర వేసుకున్నారు. ఇప్పటి దాకా ఆయన చిత్రాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా లెవెల్‌లోనే విడుదలవుతాయి. ఈ స్టార్ హీరో ఒక్కొక్క సినిమాకి సుమారు 100 కోట్ల నుంచి 150 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో రెండవ స్థానాన్ని సంపాదించాడు.ఇతను పుష్ప తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.  


ఒక్కొక్క మూవీకి 60 నుంచి 130 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. ఆ తర్వాత స్థానాన్ని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. రీసెంట్‌గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్టు కొట్టిన ఆయన ఒక్కొక్క మూవీకి 60 కోట్ల నుంచి 100 కోట్ల దాకా చార్జ్ చేస్తున్నారని సమాచారం.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు, సూపర్ స్టార్ మహేష్ బాబు 60 నుంచి 80 కోట్ల వరకు ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 50 నుంచి 75 కోట్లు అలాగే మెగాస్టార్ చిరంజీవి 50 నుంచి 60 కోట్లు ఇంకా విజయ్ దేవరకొండ ఒక్కొక్క సినిమాకి 25 కోట్ల నుంచి 45 కోట్ల వరకు అలాగే నందమూరి బాలకృష్ణ 18 నుంచి 30 కోట్లు, ఇక టాప్ 10లో మాస్ రాజా రవితేజ కూడా స్థానం దక్కించుకున్నారు. ఆయన హిట్లతో సంబంధం లేకుండా ఒక్కొక్క సినిమాకు సుమారుగా 15 కోట్ల నుంచి 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని అందుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: