టీజర్: విభిన్నంగా ఆకట్టుకుంటున్న మామా మశ్చీంద్ర టీజర్..!!

Divya
తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు హీరో సుధీర్ బాబు.. తాజాగా తాను నటిస్తున్న చిత్రం మామా మశ్చీంద్ర.. ఈ చిత్రాన్ని నటుడు,డైరెక్టర్గా పేరు సంపాదించిన హర్షవర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో సుధీర్ బాబు మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నారు. అయితే రెండు గెటప్పులలో అదరగొట్టేస్తున్న సుదీర్ బాబు మూడో లుక్ లో మాత్రం చాలా రష్ గా ఓల్డ్ ఏజ్ లో కనిపిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించిన ఈ సినిమా టీజర్ ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా టీజర్ అని మహేష్ బాబు విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.అయితే ఇందులో సుదీర్ బాబు అదిరిపోయే లుక్కులో కనిపించడం జరిగింది. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నట్లు ఈ సినిమా టీజర్ చూస్తే మనకి అర్థమవుతోంది.. మూడు జన్మల శత్రువులు కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలోని డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలు తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నారు సుధీర్ బాబు.

ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కానీ ప్రేమ కథ చిత్రం అంత గుర్తింపు అయితే రాలేకపోయాయి.. ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్ కావడంతో సుధీర్ బాబు కథల పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి ఈసారి త్రిబుల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమా అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి మరి. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ వైరల్ గా మారుతోంది. మరి ఈసారైనా సరైన సక్సెస్ తో అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి సుధీర్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: