"గేమ్ చేంజర్" మూవీ షూటింగ్ కేవలం అన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందట..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన విడుదల అయినటువంటి ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయాడు. ఈ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రపంచ వ్యాప్తంగా తన నటన తో ప్రశంసలను అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో చరణ్ సరసన కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ను ఈ మూవీ బృందం ఈ నెల 23 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది  ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే తుది దశలు చేరినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కేవలం ఇంకో 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు ... ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను  ఈ చిత్ర బృందం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: