"గేమ్ చెంజర్" నెక్స్ట్ షెడ్యూల్ పై క్రేజీ న్యూస్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇండియాలో అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ , సునీల్ , అంజలి ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

ఇది ఇలా ఉంటే సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 23 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను తదుపరి షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో పల్లెటూరి యువకుడి పాత్రలో చరణ్ కనిపించనుండగా ... మరో పాత్రలో సిటీ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే దేశ వ్యాప్తంగా అదిరిపోయే క్రేజ్ ఉన్నటువంటి చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకోని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: