వెంకటేష్ "సైంధవ్" మూవీలో ఆ క్రేజీ బ్యూటీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ తో దర్శకుడు గా తన కెరీర్ లో మొదలు పెట్టి ... మొదటి సినిమా తోనే మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ విషయాన్ని ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.
 

ఇది ఇంతే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ లో ఈ సినిమా బృందం వెంకటేష్ మరియు శ్రద్ధ శ్రీనాథ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రుహాని శర్మ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సైంధవ్ మూవీ లో రుహని శర్మ డాక్టర్ రేణు పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: