మహేష్ చేతిలో మీదగా విడుదల కానున్న "మామా మశ్చీంద్ర" మూవీ టీజర్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి వాటిలో కొన్ని సినిమా లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఆఖరుగా హంట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. పరవాలేదు అనే రేంజ్ అంచనాలు నడుము విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆపజయం పాలయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ "మామా మశ్చీంద్ర" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో సుధీర్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాలో సుధీర్ బాబు చేసిన మూడు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను కూడా విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ ను ఈ రోజు ఉదయం 10 గంటల 33 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ కి నటుడు మరియు దర్శకుడు అయినటువంటి హర్ష వర్ధన్ దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: