'ఓయ్' హీరోయిన్.. ఇప్పుడు ఎలా మారిందో చూడండి?

praveen
బాయ్స్ అనే సినిమాతో హీరోగా అవతారం ఎత్తిన సిద్ధార్థ్ ఆ తర్వాత తెలుగులో కూడా ఎన్నో సినిమాలు లో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా సిద్ధార్థ నటించినా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ గానే  కొనసాగుతూ ఉంటాయి. ఇలా సిద్ధార్థ్ ను తెలుగులో హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ఓయ్ సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. 2009లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆనంద్ రంగా దర్శకత్వంలో కేవలం 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన  ఈ సినిమా 47 కోట్ల వరకు వసూలు చేసింది అని చెప్పాలి.

 ఇక ఈ సినిమాలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ షామిలి హీరోయిన్గా నటించింది. అప్పట్లో బేబీ షామిలి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఓయ్ సినిమాలో మొదటిసారి హీరోయిన్గా నటించిన బేబీ షామిలి ఆ తర్వాత మాత్రం సినిమాలకు దూరమైంది. చివరిగా అమ్మమ్మ గారి ఇల్లు అనే సినిమాలో నటించింది. ఇక ఓయ్ సినిమాలో బేబీ షామిలి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా అయితే యూత్ అందరికి కూడా బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి.

 అయితే అటు సినిమాలకు దూరమైన బేబీ షామిలి అటు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా ఉండదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే తన ఫోటోలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల తను లేటెస్ట్ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది బేబీ షామిలి. ఈ క్రమంలోనే ఓయ్ సినిమా హీరోయిన్ కాస్త గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అని చెప్పాలి. దీంతో ఈ అమ్మడి ఫోటోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ అమ్మడు మారిపోయిన తీరు చూసే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: