సమీరా రెడ్డి విషయంలో అట్రాక్ట్ అయ్యే సమయంలో నా వయస్సు 23 :: ఎన్టీఆర్

murali krishna
ప్రతి వ్యక్తి తనకు కాబోయే భార్యకు సంబంధించి కొన్ని అంచనాలు పెట్టుకుంటారు. సెలబ్రిటీలు సైతం ఇందుకు అతీతం కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు వేశారు.
పెళ్లికి ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తారక్ ఎప్పుడు ఏది జరిగితే దానిని యాక్సెప్ట్ చేయాలే తప్ప ప్లానింగ్ అంటూ ఏమీ లేదని అన్నారు. మా అమ్మను ఎవరైతే బాగా చూసుకుంటారో అలాంటి అమ్మాయి నా భార్యగా ఉండాలని కోరుకుంటున్నానని తారక్ తెలిపారు. నేను మా అమ్మను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. సినిమా కథను బట్టి బడ్జెట్ డిసైడ్ అవుతుందని తారక్ తెలిపారు. సినిమాసెట్స్ కోసం ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఖరీదు పెరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రతిదానిని భూతద్దంలో చూడొద్దని మా కంటే ఎక్కువ సంపాదించే వాళ్లు చాలామంది ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. ఇంటర్ లో క్రష్, లవ్ లు ఉంటాయని అవి సాధారణం అని తారక్ తెలిపారు. సమీరా రెడ్డి విషయంలో అట్రాక్ట్ అయ్యానని ఆ సమయంలో నా వయస్సు 23 అని తారక్ అన్నారు. నేను తీసుకున్న నిర్ణయం తప్పా అని ఎప్పుడూ ఆలోచించలేదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్స్ ను కలపకూడదని తారక్ తెలిపారు. గతంలో ఎన్టీఆర్ చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ భార్య గా ఎలాంటి అమ్మాయిని కోరుకున్నారో అలాంటి అమ్మాయే దొరికిందని నెటిజన్లు చెబుతున్నారు. లక్ష్మీ ప్రణతి మంచి కోడలు అని నందమూరి ఫ్యామిలీ కీర్తి ప్రతిష్టలు పెరిగే లా ఆమె వ్యవహరించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వివాదాలకు, వివాదాస్పద అంశాలకు దూరం గా లక్ష్మీ ప్రణతి ఉంటారని నెటిజన్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా తో బిజీ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: