ట్రైలర్ తో ఉగ్రరూపం చూపిస్తున్న నరేష్..!!

Divya
ఒకప్పుడు కామెడీ తరహా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటులలో అల్లరి నరేష్ ముందు వారసలో ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేకపోవడంతో మొదటిసారి తన కెరియర్లో నాంది సినిమాతో ఒక విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ఈ సినిమాతో తన కెరీర్ను ఒక్కసారిగా మార్చుకున్నారు ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వంలో తెరకెక్కించారు. దీంతో అల్లరి నరేష్ ఇకమీదట కామెడీ సినిమాలలో నటించకూడదని విషయాన్ని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

అందుకే తన చిత్రాలన్నీ కూడా ఎక్కువగా మాస్ ఎలిమెంట్తో కూడిన సినిమాలనే తెరకెక్కించాలని చూస్తున్నారు. అలా ఈసారి ప్రేక్షకుల ముందుకు ఉగ్రం సినిమాతో రాబోతున్నారు.తాజాగా ఉగ్రం సినిమా ట్రైలర్ విడుదల కావడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే టైటిల్ కి తగ్గట్టుగానే నరేష్ ఈ చిత్రంలో ఉగ్రరూపం చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అల్లరి నరేష్ మొదటిసారిగా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇందులో కనిపించబోతున్నారు. ఇందులో నరేష్ 2 వేరియేషన్ ఉన్న పాత్రలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ట్రైలర్లు చూపించిన ప్రకారం యాక్షన్ ఎమోషన్స్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి సైతం బాగా ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ట్రైలర్ ఉండడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది. ఈసారి సమ్మర్లో కచ్చితంగా అల్లరి నరేష్ అల్లరిస్తారని నమ్మకంతో అభిమానులు ఉన్నారు ఈ సినిమా మే 5వ తేదీన విడుదల కాబోతోంది. నాంది సినిమా హిట్ కావడంతో డైరెక్టర్ కు మరొక అవకాశం ఇచ్చారు అల్లరి నరేష్ మరి దీంతో వీరిద్దరి హీట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: