వైరల్ అవుతున్న ఆదిపురుష్ న్యూ పోస్టర్...!!

murali krishna
పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్  హీరో గా "ఆదిపురుష్" అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ కూడా ఎప్పుడో కంప్లీట్ అయింది.
అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్.. మరి చీప్ క్వాలిటీ గా ఉండటంతో.. ఫస్ట్ టీజర్ విడుదల చేసిన సమయంలో అభిమానుల నుండి విపరీతమైన నెగెటివిటీ అయితే వచ్చింది. "ఆదిపురుష్" మొదటి టీజర్ పై భారీగా ట్రోలింగ్ జరిగింది.
దీంతో జనవరి నెలలో విడుదల కావలసిన సినిమాని జూన్ 16కి వాయిదా వేశారనీ తెలుస్తుంది.. అదే సమయంలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వరకు మొత్తం మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది.కొద్ది రోజుల క్రితం కొత్త టీజర్ ను కూడా విడుదల చేసారు.. మొదటిసారి విడుదల చేసిన టీజర్ నే మరోసారి విడుదల చేసి.. గ్రాఫిక్స్ వర్క్ లో కొన్ని మార్పులు చూపించారు. ఈసారి టీజర్ ఎంత గానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా "ఆదిపురుష్" నుండి కొత్త పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ప్రభాస్ బాణం భూమివైపు ఎక్కుపెట్టి నిలబడి ఉన్నాడట.ఈ స్టిల్ అభిమానులను అయితే ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. రామాయణం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన సీత పాత్రలో కృతి సనన్ నటించిన విషయం తెలిసిందే.సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో నటించడం జరిగింది. జూన్ 16వ తారీకు ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం.. జైశ్రీరామ్ టైటిల్ పేరిట విడుదల అయిన ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది.ఈ సినిమా పై అంచనాలు కూడా కొద్దిగా తగ్గాయి అనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని కొంతమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: