గేమ్ చేంజర్ సినిమాలో శంకర్ రేంజ్ భారీ క్లైమాక్స్ ఉండబోతుందా...?

murali krishna
రాంచరణ్ ఇటు పర్సనల్ లైఫ్ ని అటు ప్రొఫెషనల్ లైఫ్ ని చాలా ఎంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు.
భార్య ఉపాసన కోసం పుట్టబోయే బిడ్డ కోసం వీలైనంత ఎక్కువగా టైమ్ కేటాయిస్తూనే మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ని చరణ్ చక చక మని పరుగులు పెట్టించేస్తున్నాడు. విలక్షణ దర్శకుడు శంకర్ నేతృత్వంలో రాజకీయ, సమకాలీన అంశాలతో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట రామ్ చరణ్ రీసెంట్ గా విడుదల చేసిన టైటిల్ లోగో కు విశేష స్పందన రాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చిందని తెలుస్తుంది.
గేమ్ ఛేంజర్ షూటింగ్ ని శంకర్ దాదాపుగా పూర్తి చేశాడని సమాచారం.మరో రెండు నెలలు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ అయితే ఉంది. ప్రస్తుతం శంకర్ క్లైమాక్స్ ఎపిసోడ్ షూటింగ్ పై ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది.హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఓ భారీ సెట్ వేసిన శంకర్ కేజీఎఫ్ యాక్షన్ మాస్టర్స్ అన్బు అండ్ అరివు డైరెక్షన్ లో క్లైమాక్స్ ను శంకర్ చిత్రీకరించబోతున్నాడని సమాచారం.ఇది శంకర్ స్టయిల్ లో చాలా లావిష్ గా సినిమాకే హైలెట్ గా ఉంటుందని ఫిలిమ్ నగర్ లో టాక్ అయితే వినిపిస్తుంది.
రాంచరణ్ మగధీర సినిమాలో 100 మందితో చేసిన ఫైట్ మన అందరికి బాగా తెలిసిందే ..ఆ ఫైట్ ను మించేలా గేమ్ ఛేంజర్ లో భారీ ఫైట్ ను శంకర్ ప్లాన్ చేశాడని సమాచారం.దాదాపు 12వందల మందితో క్లైమాక్స్ ఫైట్ ఉంటుందని తెలుస్తుంది.ఈ ఎపిసోడ్ కోసమే మన టాలీవుడ్ ఫైటర్స్ తో పాటుగా కన్నడ నుంచి కూడా ఫైటర్స్ ను కూడా శంకర్ రప్పించాడట. ఈ ఫైట్ లో విలన్ గా నటిస్తున్న ఎస్ జే సూర్య కూడా జాయిన్ అవ్వబోతున్నాడని తెలుస్తుంది.
మగధీర సినిమాలో వందమందితో ఫైట్ అంటేనే థియేటర్లు బద్దలు అయ్యాయి ..ఇప్పుడు 12వందల మందితో ఫైట్ అంటే మోత మోగడం ఖాయం..వెయ్యి మందితో తమ అభిమాన హీరో చేసే ఫైట్ చూడాలని మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారట ఇక ఈ క్లైమాక్స్ ఫైట్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత చరణ్ కాస్త విరామం తీసుకోనున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: