భారీ నష్టాలను మిగిల్చిన శాకుంతలం...!!

murali krishna
శాకుంతలం సినిమాను గత కొన్నాళ్ల నుండి కొన్ని అనుకోని కారణాల వల్ల మేకర్స్ విడుదల తేదిని ప్రకటిస్తూ మళ్ళీ వాయిదా వేస్తూ వస్తున్నారు..
మరి ఎట్టకేలకు ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల అయ్యింది.. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో గ్రాండ్ గా నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో అయితే నిర్మించారు.
అయితే ఈ సినిమాకు మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ కు వచ్చే ఆడియెన్స్ సంఖ్య కూడా బాగా తగ్గింది.. దీంతో ఈ సినిమా వారం కూడా గడవక ముందే డిజాస్టర్ అని తేల్చేసారట... మరి ఈ సినిమా చాలా ప్రాంతాల్లో షోలు లేకపోవడంతో సినిమాను దాదాపుగా తీసేసినట్టే అని సమాచారం.. అతి త్వరలోనే మిగతా చోట్ల కూడా పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితులు ఉన్నట్టు సమాచారం.ఈ సినిమా 19 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది.. దీంతో ఈ టార్గెట్ రీచ్ కాకపోవడంతో చాలా నష్టాలు వచ్చినట్టు అయితే తెలుస్తుంది.. రెండు మూడు కాదు ఏకంగా 12 నుండి 13 కోట్ల నష్టాలు వచ్చినట్లు సమాచారం.. ఈ వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.28 కోట్ల షేర్ 9 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు అయితే తెలుస్తుంది.. మరి 19 కోట్ల టార్గెట్ ఫినిష్ చెయ్యాలంటే ఇంకా 14 కోట్ల రేంజ్ లో రాబట్టాల్సి ఉందనీ సమాచారం .. మరి అన్ని చోట్ల తీసేస్తున్నట్టు అనిపిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఆ కలెక్షన్స్ రాబట్టడం అసాధ్యమే అని తెలుస్తుంది.. అందుకే నిర్మాతలకు భారీ నష్టాలను అందించినట్టు సమాచారం.స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కగా సమంతకు ఈ సినిమాతో భారీ ప్లాప్ పడింది.. కాగా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: