షాక్ .. తన జీవిత కథ ఆధారంగానే సినిమాను తీసిన నరేష్- పవిత్ర..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి పవిత్ర లోకేష్.. నటుడు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గడిచిన కొన్ని నెలల నుంచి వీరిద్దరి పేరు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించారు. వీరిద్దరూ ప్రేమించుకొని మరి సహజీవనం చేస్తున్నారని వార్తలైతే వినిపించాయి. అయితే వీరిద్దరూ ట్రెండుకు తగ్గట్టుగా మారుతూనే ఉంటారు. దీంతో వీరిద్దరి ప్రేమాయణం మరొక రేంజ్ కు వెళ్ళిపోయింది. ఈ ఏడాది మొదట్లో వీరిద్దరూ లిప్ కిస్ చేసుకుంటూ ఒక వీడియోను షేర్ చేయడంతో అది మరింత వైరల్ గా మారింది.
ఆ తర్వాత వివాహమైందని ఒక వీడియోను కూడా షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇదంతా మళ్లీ పెళ్లి అనే సినిమా కోసమే అన్నట్లుగా తెలియజేయడం జరిగింది. నరేష్ ,పవిత్ర కాంబినేషన్లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎం.ఎస్.రాజు తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు విడుదల కావడం జరిగింది. తాజాగా ఈ రోజున టీజర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ కేవలం నరేష్ లైఫ్ గురించి మాత్రమే చూపించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రమ్య రఘుపతి నరేష్ ల పెళ్లి తర్వాత పవిత్ర లోకేష్ తో స్నేహం ప్రేమ డేటింగ్ గురించి చూపించినట్లుగా తెలుస్తోంది.

టీజర్ విషయానికి వస్తే.. మొదట తెలుగు ఇండస్ట్రీ కన్నడ వైపు చూపు తిప్పిందేంటి అనే వాయిస్ తో మళ్లీ పెళ్లి అనే సినిమా టీజర్ మొదలవుతుంది.. ఇందులో రమ్య రఘుపతి పాత్రలో వనిత విజయ్ కుమార్ నటించారు. వనిత మీడియాతో తాను మోసపోయానని తెలియజేయడంతో ఈ టీజర్ మొదలవుతుంది. అయితే తన భర్త ఒక మృగం అంటూ చెప్పగా.. నరేష్ పవిత్ర లోకేష్ తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ కనిపిస్తుంది. తెలుగుతోపాటు కన్నడాలో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ విలక్షణమైన కథతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: