విరూపాక్ష రివ్యూ: సూపర్ థ్రిల్లర్..!

Purushottham Vinay
థ్రిల్లర్ జానర్ సినిమాలు అంటే ఆడియన్స్ కి మొదటి నుండి కూడా చాలా ఇష్టం.ఎందుకంటే అలాంటి సినిమాలు ఇచ్చే అనుభూతి చాలా బాగుంటుంది. థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా ఆ సినిమాలోని సీన్స్ కొన్ని రోజుల పాటు మనల్ని వెంటాడుతూ ఉంటాయి.అలా చాలా కాలం తర్వాత హారర్ అనుభూతిని టీజర్ ఇంకా ట్రైలర్ ద్వారా చూసిన తరువాత అనిపించిన చిత్రం 'విరూపాక్ష'.సాయి ధరమ్ తేజ్ ఇంకా సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల అయ్యింది.విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు కలిగించిందో ఇంకా విడుదల తర్వాత కూడా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కథ విషయానికి వస్తే 1979 ఇంకా 1991 మధ్యలో 'రుద్రవణం' అనే ఒక ఊరిలో జరిగిన సంఘటనలను ఆధారంగా తీసుకొని రెడీ చేసిన కథ ఇది.కథలోకి వెళ్తే 1979 వ సంవత్సరం లో ఒక జంట గ్రామం లో చేతబడులు చేస్తుంది అని భావించి గ్రామస్తులందరూ కూడా ఆ జంటని సజీవ దహనం చేసి చంపుతారు.మంటల్లో కాలిపోతున్న సమయం లో ఆ జంట వచ్చే పుష్కరం లోపు ఈ గ్రామ ప్రజలందరూ కూడా చనిపోతారు, ఇక ఇదే మా శాపం అని వారిని శపిస్తారు.


ఇక ఈ కథ 1979 నుండి 1991 వ సంవత్సరం లోకి అడుగుపెడుతుంది.ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా గ్రామం మొత్తాన్ని కూడా మంత్రం శక్తితో అష్టదిగ్బంధనం చేసినా కూడా వరుసగా హత్యలనేవి జరుగుతూనే ఉంటాయి.అయితే ఈ హత్యలు చేస్తున్నది ఎవరు అని తెలుసుకోవడానికి సూర్య ( సాయి ధరమ్ తేజ్) రంగం లోకి దిగుతాడు.అతను రంగం లోకి దిగిన తర్వాత కథలో ఎవ్వరూ ఊహించని ట్విస్టులు కనిపిస్తాయి. ఆ ట్విస్టులను మాత్రం ఖచ్చితంగా మీరు థియేటర్ లో చూసి అనుభూతి చెందాల్సిందే..ఈ సినిమాని చాలా అద్భుతంగా థ్రిల్లింగ్ కి గురి అయ్యే విధంగా డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కించాడు.ఇది ఆయనకీ మొదటి సినిమా అంటే మాత్రం అసలు ఎవ్వరూ నమ్మలేరు.


ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే హీరో సాయి ధరమ్ తేజ్ ఇంకా హీరోయిన్ సంయుక్త మీనన్ చాలా అద్భుతంగా నటించారు.ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.ముఖ్యంగా చివరి 30 నిమిషాలు అయితే ఆడియన్స్ సీట్ చివర కూర్చొని చూస్తారు.అంతలా సస్పెన్స్ కి గురి చేస్తుంది ఈ సినిమా. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర ఇచ్చే ట్విస్టు కి అయితే ఖచ్చితంగా మన ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం.ఇక ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇంకా సౌండ్ మిక్సింగ్.అతని మ్యూజిక్ ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతిని కలిగించింది.మొత్తం మీద హారర్ జానర్ మీద ఇటీవల తెరకెక్కిన సినిమాల్లో 'విరూపాక్షా' సినిమా రీసెంట్ టైం లో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: