చిరంజీవిని టార్గెట్ చేస్తూ పోస్టర్లు..!!

Divya
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది .ఈ చిత్రాన్ని డైరెక్ట్ గోపీచంద్ మల్లిని దర్శకత్వం వహించారు. ఇందులో హీరొయిన్ గా శృతిహాసన్ నటించింది. ఇదే ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకి పోటీగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజులు పూర్తి చేసుకొని రికార్డును సైతం సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎనిమిది సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది.
ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఓటీటి లో బాగా హవా నడిపిస్తున్నాయి. ఒక సినిమా ఎనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడడం గొప్ప విషయం.. అలా హిందూపురం ఆలూరు, గుంటూరు, చిలకలూరిపేట ,కర్నూలు ,ఆదోని విజయవాడ ,ఆళ్లగడ్డ వంటి ప్రాంతాలలో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఈనెల 23వ తేదీన వందరోజుల ఫంక్షన్లు చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో తాజాగా ఒక పోస్టర్ని విడుదల చేశారు చిత్ర బృందం. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అనే పోస్టర్ ఉండడంతో ఇప్పుడు హార్ట్ టాపిక్ మారుతోంది.ఈ ఎడాది సంక్రాంతి కానుకగా బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో పాటు చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమా కూడా విడుదల అయింది.. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకోగా వీరసింహారెడ్డి సినిమా మాత్రం 100 రోజులు పూర్తిచేసుకుంది.

పోస్టర్లు సెంచరీ విత్ సింగిల్ హ్యాండ్ అని ఉండడంతో చిరంజీవి పైన సెటైర్ వేసే విధంగా పోస్టర్ ఉన్నట్లుగా  అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వాల్తేర్ వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కూడా నటించారు. కానీ వీరసింహారెడ్డి సినిమాలో కేవలం బాలయ్య మాత్రమే నటించారు. ఇక మైత్రి మూవీ వారు ఈ రెండు సినిమాలకు సంబంధించి పలు పోస్టర్లను విడుదల చేయడంతో చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్య అపహాస్యం చేస్తూ వందరోజుల పోస్టర్లను విడుదల చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: