ఏంటి.. బిగ్ బాస్ జెస్సి.. పూజకు పనికి రాని పువ్వా?

praveen
ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు గత 15 ఏళ్ల నుంచి కూడా ఎంతో విజయవంతమైన షోగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికీ టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది ఈ షో. ఎంతోమంది కొరియోగ్రాఫర్లకు ఇండస్ట్రీలోకి వచ్చేందుకు మంచి దారి చూపించింది. ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది అని చెప్పాలి. ఇప్పటికి దేశ నలుమూలల నుంచి వస్తు ఎంతోమంది ఢీ షోలో తమ డాన్సులతో అదరగొడుతున్నారు.

 అయితే ఒకప్పుడు ఢీ షో అంటే కేవలం డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మాత్రమే ఉండేది. కానీ ఇటీవలే కాలంలో మాత్రం కామెడీ షో లను మించిన ఎంటర్టైన్మెంట్ ఢీ షోలో చూస్తున్నాం అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి సీజన్ కి కూడా కొత్త టీం లీడర్లను తీసుకువచ్చి ప్రేక్షకులను వినూత్నంగా అలరించేందుకు ఢీ షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది హైపర్ ఆదితో పాటు బిగ్బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించిన జెస్సీని కూడా టీం లీడర్ గా తీసుకువచ్చారు. అయితే గత కొన్ని ఎపిసోడ్లు చూసిన తర్వాత జెస్సిని టీం లీడర్ గా తీసుకొచ్చింది కేవలం అవమానించడానికి అని మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమైంది.

 ఎందుకంటే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన జెస్సి అసలు మగాడే కాదు.. అన్నట్లుగా ఈ ఎన్నో పంచులు వేస్తూ ఉంటారు. కేవలం హైపర్ ఆది మాత్రమే కాదు శేఖర్ మాస్టర్, ప్రదీప్ సైతం ఇలాంటి పంచులు వేస్తూ ఉండడం మాత్రం జెస్సి అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. ఇక ఇటీవల విడుదలైన ప్రోమోలో కూడా ఇలాంటిదే చేశారు. లేడీ టీమ్ లీడర్ ను దగ్గరికి తీసుకునేందుకు జెస్సి ప్రయత్నిస్తాడు. ఆమెకు చలివేస్తుందట వెచ్చగా ఉండడానికి దగ్గరికి తీసుకుంటున్నాను అని చెప్తాడు. దీంతో ప్రదీప్, శేఖర్ మాస్టర్, శ్రద్ధదాస్ ఇలా ఒకరి తర్వాత ఒకరు జెస్సి అసలు మగాడే కాదు.. దేనికి పనికిరాడు అన్నట్లుగా పంచులు వేస్తారు. చివర్లో శ్రద్ధదాస్ నువ్వు పూజకి పనికిరాని పువ్వు అంటూ పంచ్ వేయడం మాత్రం జెస్సి అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: