పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..!!

Divya
మలయాళం ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మొదట నేను శైలజ కృష్ణమూర్తి అనే సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా పేర్కొంది. ఈ సినిమాకు జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కు సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు.. రీసెంట్గా నాని నటించిన దసరా సినిమాలో వెన్నెల పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. తనకు వచ్చిన అవకాశాలతో కీర్తి సురేష్ నటనపరంగా అదరగొట్టేస్తోందని చెప్పవచ్చు.

గ్లామర్ పరంగా కాస్త ఆలోచించి అడుగు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈమధ్య కాలంలో గ్లామర్ పాత్రలకు సైతం సై అంటూ నటిస్తోంది సినిమాలలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో మాత్రం టచ్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది కీర్తి సురేష్. రీసెంట్గా కీర్తి సురేష్ అభిమానులతో ఒక చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలోని కీర్తి సురేష్ పెళ్లిపై ఒక అభిమాని ప్రశ్న అడగగా అందుకు కీర్తి సురేష్ వెరైటీగా జవాబు ఇచ్చింది..
మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. పెళ్లి గురించి తనకి ఇప్పుడప్పుడే ఆలోచన లేదంటే జవాబు ఇచ్చింది. దీంతో కీర్తి సురేష్ పెళ్లిపై వస్తున్న వార్తలు అన్నీ కూడా కేవలం వాటి రూమర్సే అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో బిజినెస్ మాన్ ని వివాహం చేసుకోబోతోంది అంటే వార్తలు వినిపించాయి అవన్నీ కూడా వట్టి రూమర్లే అన్నట్టుగా తేల్చి పారేసింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఉదయం ఇది స్టాలిన్ తో ఒక సినిమా జయం రవికి జోడిగా మరొక సినిమాలో నటిస్తున్నది ఒకవైపు తెలుగులో మరొకవైపు తమిళంలో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: