క్రేజీ తెలుగు మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో కొన్ని మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమాల షూటింగ్ వివరాలను తెలుసుకుందాం.
ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క కొత్త షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ మూవీ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ , మాలవికా మోహన్ , రీద్ది కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించనుండగా ... సంజయ్ దత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని శంకరపల్లి లో జరుగుతుంది. ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో పాత్రలో నటిస్తోంది.

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "ఓజి" మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ కూడా ప్రస్తుతం పాల్గొంటుంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలను ఈ చిత్ర బృందం చిత్రీకరిస్తుంది. ఎన్టీఆర్ ... కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఎన్టీఆర్ ... సైఫ్ అలీ ఖాన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: