జవాన్ మూవీలో పఠాన్ బ్యూటీ..?

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరీర్ ను కొనసాగుతున్న షారుక్ ఖాన్ తాజాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందినటు వంటి పఠాన్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి దీపికా పదుకొనే ... షారుక్ సరసన హీరోయిన్ గా నటించగా ... జాన్ అబ్రహం ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టింది.

ఇలా పఠాన్ మూవీ  బ్లాక్ బాస్టర్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న షారుఖ్ ప్రస్తుతం జవాన్ అనే మరో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ప్రియమణి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అట్లీ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో పఠాన్ మూవీ లో హీరోయిన్ గా నటించిన దీపికా పదుకొనే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు ... జవాన్ మూవీ లోని ఓ సాంగ్ లో షారుక్ మరియు దీపిక ఇద్దరు కూడా డాన్స్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: