నాని 30 వ సినిమా టైటిల్ అదే?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించి ఎంతగానో మెప్పించింది.అసలు మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో నాని నటించి మెప్పించాడు. పాన్ ఇండియా రేంజిలో విడుదల అయిన ఈ సినిమా అన్ని భాషల్లో మెప్పించలేకపోయినా తెలుగులో మాత్రం మంచి లాభాలని తెచ్చిపెడుతుంది. ఈ సినిమా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు సమాచారం తెలుస్తుంది.ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. నాని కెరీర్ లో 30వ మూవీగా ఈ మూవీ రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో ద్వారా మూవీ థీమ్ ఏంటో వివరించారు.ఇది తండ్రి కూతురుకి మధ్య జరిగే కథ అని తెలుస్తోంది. 


ఇక ఈ సినిమాలో సీతారామంతో ఎంతగానో ఆకట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ సినిమాకి హాయ్ నాన్న అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కియారా ఖన్నా నాని కూతురిగా నటిస్తోంది.ఇక ఈ సినిమా కూడా మజిల్, నిన్ను కోరి లాంటి సెన్సిబిల్ హిట్ అవుతుందని నాని ఫ్యాన్స్ బావిస్తున్నారు. ఈ సినిమాతో నాని ఖచ్చితంగా మరో గుర్తుండిపోయే హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు నాని ఫ్యాన్స్. ఇక ఈ సినిమాకు కూడా శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ ను త్వరలోనే ఇవ్వనున్నారు మేకర్స్.ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ని అందుకుంటాడో చూడాలి. ఈ సినిమా కూడా దసరా లాగా పెద్ద హిట్ అయితే నాని రేంజ్ మరింత పెరగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: