షారుక్ "జవాన్" మూవీ టీజర్ విడుదల అయ్యేది అప్పుడే..?

Pulgam Srinivas
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇప్పటికే ఈ సంవత్సరం పఠాన్ మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1009 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం షారుక్ ... అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న జవాన్ అనే భారీ బడ్జెట్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని జూన్ 2 వ తేదీన పలు భాషలలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ యొక్క టీజర్ ను మే మొదటి వారంలో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో షారుక్ సరసన లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ లో విజయ్ సేతుపతి , ప్రియమణి , సాన్యా మల్హోత్రా , సునీల్ గ్రోవర్ , యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరి ఖాన్ గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. పఠాన్ మూవీ తర్వాత షారుక్ నుండి రాబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: