మరో టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకున్న జాన్వి కపూర్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇంత కాలం కాటు బాలీవుడ్ ఇండస్ట్రీ పై మాత్రమే ఫోకస్ పెట్టిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పై కూడా అద్భుతమైన ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దు గుమ్మ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపాందుతున్న తెలుగు మూవీ లో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో కూడా ఈ ముద్దు గుమ్మ పాల్గొంటుంది.

ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కి మించి భారీ ఎత్తున విడుదల చేసే సన్నాహాలను ఈ చిత్ర బృందం చేస్తుంది. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే జాన్వీ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కాగా ఈ ముద్దుగుమ్మ కు మరో భారీ క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలో ఆఫర్ వచ్చినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో అదిరిపోయే ఇందులో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి మూవీ ని బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చరణ్ సరసన జాన్వీ ని హీరోయిన్ గా తీసుకోవాలి అని ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: