స్ట్రైట్ మూవీలపై ఆసక్తి చూపిస్తున్న చిరంజీవి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . చిరంజీవి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో రీమేక్ మూవీ లలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగంగా చిరంజీవి నటించిన ఎన్నో రీమేక్ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా సాధించాయి . ఇలా రీమిక్ మూవీ లతో అద్భుతమైన విజయాలను ఎన్నింటినో బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న చిరంజీవి పోయిన సంవత్సరం మలయాళ సినిమా లూసిఫర్ కు రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమాలో హీరో గా నటించాడు .

ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయం సాధించింది. ప్రస్తుతం చిరంజీవి "భోళా శంకర్" సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తమిళ సినిమా అయినటు వంటి వేదలం కు రీమేక్ గా రూపొందుతుంది. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు .

మహతి స్వర సాగర సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ ... సుశాంత్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇలా ప్రస్తుతం కూడా ఒక రీమేక్ మూవీ లో నటిస్తున్న చిరంజీవి ఈ మూవీ తర్వాత కొంత కాలం పాటు కేవలం స్టేట్ తెలుగు మూవీ లలోనే నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగినట్టు గానే చిరంజీవి ప్రస్తుతం అనేక కథలను వింటునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: