అన్ని నెలల్లో గూఢచారి 2 మూవీ షూటింగ్ను కంప్లీట్ చేయబోతున్న మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో అడవి శేషు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన ఈ యువ నటుడు ఆ తర్వాత క్షణం అనే మూవీ లో సోలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత గూఢచారి అనే మూవీ లో హీరో గా నటించాడు.

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో శోభిత ధోనిపాల ఒక కీలకమైన పాత్రలో నటించింది. 2018 వ సంవత్సరం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని అడవి శేషు నటన కు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అడవి శేషు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సీక్వల్ గా గూడాచారి 2 మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అలాగే ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టు నెల నుండి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే నాలుగు నెలల్లో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి ఈ సినిమాను వీలైనంత త్వరగా థియేటర్ లలో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గూడచారి మూవీ మంచి విజయం సాధించడంతో గూఢచారి 2 మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: