అఫీషియల్ : దసరా మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ దర్శకుడు ఈ మూవీ తోనే దర్శకుడు గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ ... నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి నేను లోకల్ మూవీ లో నటించారు. వీరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఈ సినిమా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మార్చి 30 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు కూడా లభించాయి.

ఇప్పటికి కూడా ఈ సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో అద్భుతంగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ ఈ సినిమాను ఏప్రిల్ 27 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది . మరి ఈ మూవీ "ఓ టి టి"  ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: