రొమాన్స్ లో హద్దులు దాటుతున్న సిద్దార్ద్....!!

murali krishna
లీవుడ్ సినీపేక్షకులకు హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఓయ్, బొమ్మరిల్లు, ఆట, బావ,కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓ మై ఫ్రెండ్ లాంటి సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సిద్ధార్థ్.
తర్వాత నెమ్మదిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి అవకాశాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించినప్పటికీ చివరగా శర్వానంద్ తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించాడు. ఇది ఇలా ఉంటే సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టక్కర్.హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదల కాదని చాలామంది భావించినప్పటికీ తాజాగా హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందులో హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ ను చేశాడు సిద్ధార్థ్. సినిమా టీజర్ ని బట్టి చూస్తే ఇందులో సరికొత్త సిద్ధార్థ్ ని చూస్తామని చెప్పవచ్చు. ఇందులో హీరో హీరోయిన్ రొమాన్స్ మామూలుగా లేదు. ఘాటు ఘాటు ముద్దులు హగ్గు లతో హాట్ సీన్లలో అదిరిపోయే రేంజ్ లో జీవించేశారు. ప్రస్తుతం ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను మే 26వ తేదీన విడుదల చేయనున్నారు. కాగా హీరో సిద్ధార్థ్ ఇండియన్ 2 సినిమా లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే తెలుగులో మళ్లీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు హీరో సిద్ధార్థ్. మరి ఈసారైనా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడు లేదో చూడాలి మరి. ఈ టక్కర్ సినిమా హీరో సిద్ధార్థ్ కి ఏ మేరకు గుర్తింపును తెచ్చి పెడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: