సంతోషంలో ప్రభాస్ అభిమానులు... కారణం...?

murali krishna
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఫ్యాన్స్ కి ఈ సారి పెద్ద గుడ్ న్యూస్ అనడం లో ఏమాత్రం డౌట్ లేదు. ఈ సంవత్సరంలో నే ప్రభాస్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఆదిపురుష్ జూన్ నెలలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఆ సినిమా విడుదల ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.కానీ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమా ను భారీ ఎత్తున ప్రమోట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కనుక ఆదిపురుష్ సినిమా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే పరిస్థితి లేదు కనుక జూన్ నెల లో ప్రభాస్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అనేది కన్ఫర్మ్ అయింది.
ఇక కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. వచ్చే నెలతో మొత్తం షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కనుక వారు ప్రకటించినట్లుగా సెప్టెంబర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కనుక ఈ రెండు సినిమాలు ప్రభాస్ అభిమానులకు కన్నుల విందు చేయడం ఖాయం.2023లో ప్రభాస్ ఢబుల్ ధమాకా అంటూ ఇప్పటికీ మాట్లాడుకునే విధంగా సందడి ఖాయం అంటూ కూడా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా ప్రభాస్ మరో మూడు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఆ మూడు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అని సమాచారం అందుతోంది. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. వచ్చే సంవత్సర కాలంలో ప్రభాస్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయి. ఇది ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: