ఆరెంజ్ టైటిల్ పెట్టడం వెనుక.. ఎంత స్టోరీ ఉందా?

praveen
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరియర్ లో మూడో సినిమాగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఆరెంజ్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ద్వారా అటు నిర్మాతగా నాగబాబు తీవ్రంగా నష్టపోయి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఇక దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ సైతం సుదీర్ఘ కాలం పాటు అవకాశాలు దక్కించుకోలేకపోయారు. ఇక ఆరెంజ్ సినిమా ఒక పీడకల అని నిర్మాత నాగబాబు కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే ఒకప్పుడు డిజాస్టర్ గా నిలిచిన ఆరంజ్ సినిమాను ఇక ఇప్పుడు ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.

 గత నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ చేయగా.. ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరి మరి ఈ సినిమాను వీక్షించారు. ఈ సినిమా ఒకప్పుడు విడుదలైనప్పుడు వసూలు చేసిన దానికంటే ఎక్కువే వసూలు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే బొమ్మరిల్లు భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో ఆరెంజ్ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అని చెప్పాలి. అయితే ఈ సినిమాకి ఆరెంజ్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పేసారు.

 అందరూ మొదట దీని ఓ రెంజ్ మీనింగ్ కోసం ఆరెంజ్ అనే టైటిల్ పెట్టినట్లుగా ఊహించారు. కానీ అది నిజం కాదు. సన్ లైట్ కలర్ ఉదయాన్నే ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఇక మధ్యాహ్నం అయ్యే సరికి ఆ కలర్ కంప్లీట్ గా మాయం అవుతుంది. సాయంత్రం ఆరెంజ్ కలర్ లోకి సూర్యుడు తిరిగి వస్తాడు. అలాగే ప్రేమ కూడా ఆరంభంలో ఆరెంజ్ కలర్ లాగా బ్రైట్ గా ఉంటుంది. తర్వాత పూర్తిగా మాయమవుతుంది. మరల చివరి రోజుల్లో ఆ ప్రేమ బంధం బ్రైట్ గా మారుతుంది. ఈ సందేశం కథలో కూడా అంతర్లీరంగా ఉంటుంది. అందుకే మూవీకి ఆరెంజ్ అనే టైటిల్ పెట్టాము అంటూ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: