ఆరంజ్ సినిమా టైటిల్ కు అర్ధం ఏమిటో తెలుసా...?

murali krishna
రామ్ చరణ్ కెరియర్ ఆరంభంలో మూడవ చిత్రంగా ప్రేక్షకులకు ముందుకి వచ్చి భారీ డిజాస్టర్ అయిన సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ తో వచ్చిన కూడా అప్పటి జనరేషన్ యూత్ కి పెద్దగా అయితే కనెక్ట్ కాలేదు.
స్టోరీ కాస్త అడ్వాన్స్ గా ఉండడంతో ప్రేక్షకులు కూడా దానిని తిరస్కరించారు.దీంతో ఈ మూవీ అప్పటికి రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అయితే మారింది. అలాగే బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా సుదీర్ఘకాలం పాటు సినిమాలు లేకుండా కూడా చేసింది. నిర్మాతగా నాగబాబు కు కూడా తీవ్ర నష్టాలు మిగిల్చింది. ఇక ఆరెంజ్ సినిమా పీడకల నుంచి బయటపడటానికి నాగబాబు అయితే చాలా కష్టపడ్డారని చెప్పాలి. ఇప్పటికి బొమ్మరిల్లు భాస్కర్ పై ఆరెంజ్ సినిమా ప్రభావం  కూడా ఉంది.
అయితే గత నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ అయితే చేశారు. మూడు రోజులు పాటు ప్రదర్శించిన ఈ సినిమా మంచి వసూళ్లను అయితే రాబట్టింది. ఈ జనరేషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో మరల బొమ్మరిల్లు భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో ఆరెంజ్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకునే ప్రయత్నం కూడా చేశారు.
ఈ సందర్భంగా సినిమాకి ఆరెంజ్ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటనేది కూడా ఆయన రీవీల్ చేశారు. అందరూ మొదట దీన్ని 'ఓ రేంజ్' మీనింగ్ కోసం ఆరెంజ్ అనే టైటిల్ పెట్టినట్లుగా అయితే ఉహించారు. కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. సన్ లైట్ కలర్ ఉదయాన్నే ఆరెంజ్ రంగులో ఉంటుంది. అలాగే మధ్యాహ్నం అయ్యేసరికి ఆ కలర్ కంప్లీట్ గా మాయం అవుతుంది. సాయంత్రం ఆరెంజ్ కలర్ లోకి మళ్ళీ సూర్యుడు తిరిగి వస్తాడు. అలాగే ప్రేమ కూడా ఆరంభంలో ఆరెంజ్ కలర్ లా బ్రైట్ గా ఉంటుంది. తరువాత పూర్తిగా అయితే మాయం అవుతోంది.
మరల చివరి రోజుల్లో ఆ ప్రేమ బంధం మళ్ళీ బ్రైట్ గా మారుతుంది. జీవితంలో ప్రేమ అద్భుతంగా ప్రారంభం అయ్యి మధ్యలో సూర్యుడి కాంతి మాదిరిగా పూర్తిగా వైట్ లో  కలిసిపోతుంది. ఆ సమయంలో దానినీ మనం గుర్తుంచలేం. మరల జీవితం చివరి రోజుల్లో ఆ ప్రేమ అంతే అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ సందేశం కథలో కూడా అంతర్లీనంగా అయితే ఉంటుంది. అందుకే మూవీకి ఆరెంజ్ అనే టైటిల్ పెట్టడం జరిగింది అని బొమ్మరిల్లు భాస్కర్ టైటిల్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: